ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, అత్త ఎప్పుడూ తాను ఎందుకు పనికిరానని అవహేళన చేసేవారని పోలీసుల ముందు iBOMMA రవి ఆవేదన వ్యక్తం చేశాడు. వారి మాటలు సహించలేకనే iBOMMA వెబ్సైట్ను ప్రారంభించానని తెలిపాడు. 2021లో బెట్టింగ్ యాప్స్ ద్వారా రూ.75 లక్షలు సంపాదించినా తనను నమ్మలేదన్నాడు. ఇలాంటి దారి ఎంచుకుని, పోలీసులకు దొరికిపోవడానికి భార్య, అత్తే కారణమని ఆరోపించాడు.