న్యాయ విద్య చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని పాలమూరు యూనివర్సిటీ వీసీ ఆచార్య జీ.ఎన్ శ్రీనివాస్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 26న నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. న్యాయ కళాశాల విద్యార్థులు కష్టపడి చదివితే సమాజానికి న్యాయం చెప్పే అవకాశం ఉంటుందన్నారు.