VZM: పారిశుద్ధ్యం మెరుగులో శానిటేషన్ కార్యదర్శులు, కార్మికులను సమన్వయం చేసుకుని పనులు చేయించాలని రాజాం మున్సిపల్ కమీషనర్ రామచంద్రరావు సూచించారు. మంగళవారం ఉదయం పట్టణంలో పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించే సమయంలో సురక్షిత ప్రమాణాలు పాటీస్తూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అన్నారు.