ప్రకాశం: H M పాడు మండలంలోని హాజీపురంలో స్వామిత్వ కార్యక్రమంపై గ్రామసభను ఇవాళ నిర్వహించారు. సర్పంచ్ రామ సుబ్బమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇంఛార్జి గాయం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో ‘స్వామిత్వ సర్వే’ కార్యక్రమాన్ని అధికారులు పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఈ సర్వే ద్వారా గ్రామ సమగ్ర ఆస్తులను తెలుసుకునే అవకాశం ఉందన్నారు