BDK: చుంచుపల్లి మండలం నందా తండాకు చెందిన బానోతు సంధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాల్లో ఉద్యోగం సాధించినట్లు కుటుంబ సభ్యులు ఇవాళ వెల్లడించారు. ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన భీముడు, రుక్మిణి దంపతుల కుమార్తె అయిన సంధ్య ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.