TG: బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను కుట్రతో బయటకు పంపారని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదలనని స్పష్టం చేశారు. తుమ్మల నాగేశ్వరరావును వదులుకోవడం బీఆర్ఎస్ చేసిన తప్పు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఫెయిల్ అయిందని విమర్శించారు. బీఆర్ఎస్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు.