NLR: కందుకూరు మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో యూరియా, ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రహీం మంగళవారం తెలిపారు. రబీ సీజన్లో 1250 ఎకరాల్లో సాగు జరుగుతోందని, ఇప్పటివరకు పంపిణీ చేసిన 250 టన్నుల్లో రైతులు 150 టన్నులు తీసుకున్నారని చెప్పారు. ఇంకా 100 టన్నులు నిల్వలో ఉండటంతో, ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు.