W.G: జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా భీమవరం పట్టణానికి చెందిన కందుల భాను ప్రసాద్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నియామక పత్రాన్ని అఖిల భారతీయ యాదవ మహా సభ జాతీయ అధ్యక్షులు మహేష్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళ్ రావు చేతుల మీదుగా మంగళవారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉక్కుసూరి గోపాల కృష్ణ, చిదర బోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.