కామారెడ్డి పట్టణ కేంద్రంలోని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు చేసినట్లు డాక్టర్ రామ్ భాయ్ తెలిపారు. ఇవాళ అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.