KMM: ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు సమీపంలోని సాయి బాలాజీ జిన్నింగ్ మిల్లులో ఇవాళ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పత్తికి మంటలు వేగంగా వ్యాపించాయి. అయితే, మిల్లులోని కార్మికులు తక్షణమే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. దీంతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రమాదం తప్పింది. యాజమాన్యం, రైతులు ఊపిరి పీల్చుకున్నారు.