TG: ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని CM రేవంత్ అన్నారు. నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. HYD నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కోరారు. దేశ ఆదాయంలో తెలంగాణదే 10శాతం ఉండాలనేది తమ లక్ష్యమని తెలిపారు.