KNR: జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంక్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్ఎఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు రూ. 51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు.