SKLM: ఎచ్చెర్లలో ఉన్న శ్రీ గిరిజా ముక్కంటేశ్వరాలయంలో ఇవాళ స్వామివారికి రుద్రాభిషేకం, జల దివాసం (నీళ్లతో అభిషేకం) కార్యక్రమం ఉంటుందని ఆలయ ధర్మకర్త, బ్రహ్మశ్రీ పెంట సంతోష్ కుమార్ తెలిపారు. అదే విధంగా మధ్యాహ్నం అన్న సమరాధనా కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని ఈ గమనించి, ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరన్నారు.