SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఇవాళ నషాముక్త భారత్ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ బి శ్యాంసుందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యువతరం మత్తు పదార్థాలకు బానిస అయితే కలిగే అనర్థాలను వివరించామని ఆయన అన్నారు. డ్రగ్స్ రహిత భారత దేశ నిర్మాణానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని విద్యార్థులచే ప్రతిజ్ఞ, ర్యాలీ నిర్వహించామని ఎన్ఎస్ఎస్ అధికారి రవిబాబు పేర్కన్నారు.