E.G: తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామంలో RWS డిపార్ట్మెంట్ PMAGY గ్రాంట్ ద్వారా నిర్మించే CC డ్రైన్ నిర్మాణానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.20 లక్షలతో ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.