TG: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జల అవార్డులను అందజేశారు. రాష్ట్రం తరఫున పంచాయతీరాజ్ కమిషనర్ సృజన గుమ్మళ్ల(IAS) రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. దేశంలోనే అత్యధికంగా 5.20 లక్షల నీటి సంరక్షణ నిర్మాణాలు తెలంగాణలో జరిగాయి. దక్షిణ మండలంలో టాప్-3 జిల్లాల్లో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల నిలిచాయి. నీటి సంరక్షణలో తెలంగాణ కృషికి ఈ అవార్డు దక్కింది.