SRCL: ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ బస్తీ దవాఖాన, అంబేద్కర్ నగర్ యూపీహెచ్సీలో ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ గది, ఇన్ పేషెంట్ గదులు, ఇతర గదులు, ఆవరణను ఆమె పరిశీలించారు.