BDK: పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం ఏర్పాటు చేశామని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం స్థానిక దమ్మపేట సెంటర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తామన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు.