శ్రీకాకుళం రూరల్ మండలం వాకలవలస గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న రహదారి– కోనేరు వరకు సిమెంట్ రోడ్డుకు ఇవాళ శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు ప్రభుత్వ మద్దతుతో వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.