AP: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో నిఘా పెంచారు. అదేవిధంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అటవీప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే, ఇవాళ ఉదయం జరిగిన కూంబింగ్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే.