KMM: ముదిగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ అధికారుల సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు, అక్రమ దత్తత వంటి చట్టరీత్యా నేరాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని సామాజిక కార్యకర్త హరి ప్రసాద్ అన్నారు. గ్రామాల్లో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో కావ్య కోరారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.