విశాఖ: దళితులు, ఆదివాసీలు, మైనార్టీలపై దాడులు ఆపాలని, జనగణనలో కుల గణన జరపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ మంగళవారం నిరసన తెలిపింది. అలాగే బీసీలకు 42% రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రెహమాన్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్నారు.