TG: HYDలో మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ సహా పలు ప్రాజెక్ట్‌లు చేపట్టామని CM రేవంత్ తెలిపారు. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, HYDను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. సింగపూర్, దుబాయ్‌తో పోటీ పడాలని అనుకుంటున్నామన్నారు. దేశంలో ప్రతి సీఎంకు ప్రధాని పెద్దన్న అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని సహకరించాలని కోరారు.