విశాఖ: భారతదేశంలోనే 2వ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో (పద్మనాభం మండలం) ఈనెల 19న కార్తీక దీపోత్సవం జరగనుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.