MBNR: బాలానగర్ మండల కేంద్రంలో ఎస్పీ డీ.జానకి ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా తమ ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.