SRPT: మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామ శివారులో నాలుగు రోజులుగా డ్రోన్ కెమెరా చక్కర్లు కొడుతుండటంతో రైతులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఈ డ్రోన్ గ్రామం, పంట పొలాల మీదగా తిరుగుతుంది. కాగా మంగళవారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు.