దేశంలో చిన్నారుల అదృశ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 8 నిమిషాలకో చిన్నారి మిస్సింగ్‌పై దత్తత నిబంధనలు సరళీకృతం చేయాలని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. అక్రమ పద్ధతుల్లో దత్తత తీసుకుంటున్నారని అన్నారు. జిల్లాకు ఓ నోడల్ అధికారి ఉండాలని గతంలో సుప్రీం సూచించిందని తెలిపారు. కాగా, అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించేందుకు సమయం కావాలని ఏసీజీ కోరారు.