E.G: కోరుకొండ మండలం బూరుగుపూడిలో మంగళవారం ఘనంగా జరిగిన భద్రకాలేశ్వర స్వామి పూజ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించి వేద పండితుల మంత్రోచ్ఛరణతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.