NZB: పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కలెక్టరేట్లో విద్యాశాఖ పనితీరుపై మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల వారీగా నిర్వహణ తీరు, పాఠశాలలో నెలకొన్న స్థితిగతులు, బోధన తీరు, సదుపాయాల కల్పనపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్ ఉన్నారు.