SKLM: స్థానిక ఆర్ట్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న పి. వెంకటరమణ (55) మంగళవారం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. బీకాం విద్యార్థులకు తరగతి తీసుకున్న అనంతరం కుర్చీలో కూర్చున్న ఆయన ఒక్కసారిగా ఒరిగిపోవడంతో సహాధ్యాపకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.