VSP: జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ మంగళవారం రాత్రి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరగబోయే మార్గశిర మాసోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు భక్తులకు శాంతియుత వాతావరణంలో దర్శనం, నాణ్యమైన అన్నప్రసాదం అందించాలని, అన్ని పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు.