NLG: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) చండూరు మండల నూతన అధ్యక్షుడిగా నాంపల్లి సైదులు, ప్రధాన కార్యదర్శిగా పెండెం గంగాధర్ ఎన్నికయ్యారు. మంగళవారం యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయం నందు జరిగిన చండూరు మండల మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.