ప్రకాశం: దళితులు, గిరిజనులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇవాళ కనిగిరి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు భారీ ధర్నా చేపడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్నా కార్యక్రమానికి నియోజకవర్గంలోని CPI శ్రేణులు భారీగా తరలిరావలన్నారు. ఈ ధర్నాకి నాయకులు సయ్యద్ యాసిన్, తదితరులు మద్దతు తెలిపారు.