KMR: పట్టణ కేంద్రంలోని నిజాంసాగర్ ప్రధాన చౌరస్తాలో నడి రోడ్డుపై విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉంది. ఓ ప్రైవేట్ మార్కెట్ మాల్, ఓ ప్రైవేట్ స్కూల్కు వెళ్లే దారిలో రోడ్డు మధ్యలో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇనుప స్తంభం, విద్యుత్ లైన్ పెద్దదిగా ఉండటంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.