గ్రేటర్ HYD, ORR వరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు. ఇప్పటికే సుమారుగా 18 లక్షలకు పైగా మొక్కలు నాటినట్లు అధికారులు గుర్తించారు. మొక్కలు నాటినచోట్ల దాదాపుగా జియో ట్యాగింగ్ చేసేలా ఏర్పాటులు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీని ద్వారా ఎక్కడ మొక్కలు నాటామనే వివరాలు, డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి.