TG: వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌యార్డులో పత్తి రైతులను పరామర్శించనున్నారు. కాగా తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్స్ పత్తి కొనుగోళ్లను నిరవధికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఎల్1, ఎల్2, ఎల్3 సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది.