NLG: కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్, MRPS సీనియర్ నాయకులు పంది శ్రీను అనారోగ్యం కారణంగా మృతి చెందారు. మంగళవారం ఎమ్మెల్యే బాలునాయక్ ఆయన భౌతిక కాయానికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, పూలమాలవేసి, నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.