NZB: డిచ్పల్లి పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీలో వంటల్లో నాసిరకం వస్తువులు వాడుతున్నారంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిన్న వర్సిటీ హాస్టల్ విద్యార్థులు వంట సామగ్రి నాణ్యతపై నిరసన తెలియజేశారు. ఓల్డ్ బాయ్స్ హాస్టల్ మెస్‌లో వంటకాలను తయారు చేయడానికి నిల్వ ఉన్న, తక్కువ నాణ్యత గల వస్తువులను వినియోగిస్తున్నారని ఆరోపించారు.