WG: భీమవరంలో సైబర్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ ఉద్యోగి శర్మకు గత నెల 27న CBCID అధికారులుగా నమ్మబలికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. సిమ్ సమస్య పరిష్కరిస్తామంటూ ఆధార్, బ్యాంకు వివరాలు సేకరించారు. ఆ వివరాలు నమ్మిన శర్మ నుంచి దఫదఫాలుగా రూ.78 లక్షలు కొట్టేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.