NZB: ఉమ్మడి జిల్లా పరిధిలోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో అక్రమాల పర్వం కొనసాగుతోందని, భూములు, ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన ప్రక్రియలో నిబంధనలకు తిలోదకాలిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆస్తుల రేట్ల ఆధారంగా వసూళ్ల పర్వం కొనసాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిపోయాని స్థానికంగా ప్రచారం కోనసాగుతోంది.