HYD: రాయదుర్గం వద్ద గాయాలతో పడి ఉన్న సౌరబ్ కుమార్ (24)ను చికిత్స నిమిత్తం తరలించగా, NOV 13న మృతి చెందారని ACP శ్రీధర్ తెలిపారు. దర్యాప్తులో అతన్ని బైక్పై ఎక్కించుకొని మొబైల్ కోసం వాదనకు దిగిన నలుగురు దుండగులు సెంట్రింగ్ కర్రలతో దాడి చేసినట్టు బయటపడిందన్నారు. నిందితులు మహమ్మద్ రెహానా, మహమ్మద్ ఇబ్రహీం అహ్మద్ పాటు ఇద్దరు మైనర్లను అరెస్టు చేసామన్నారు.