SKLM: కార్గో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరుతూ.. మందస, వజ్రపు కొత్తూరు మండలాలకు చెందిన పలువురు రైతులు, కూటమి నాయకులు నిన్న ఆర్డీవో వెంకటేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆర్డీవోను కోరారు. ఈ ఎయిర్ పోర్ట్ వల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని వారు పేర్కొన్నారు.