KRNL: దేవనకొండ మండలంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి, చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పోషకాహారాన్ని, రిజిస్టర్లను జిల్లా కలెక్టర్ ఏ.సిరి మంగళవారం తనిఖీ చేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులతో కలిసి పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహారం నాణ్యతను ఆమె పరిశీలించారు. పిల్లలను విద్యావంతులగా తీర్చిదిద్దడంలో అంగన్వాడీలు శ్రద్ధ చూపాలన్నారు.