MHBD: మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తొర్రూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన లక్ష దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హాజరై, దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.