ప్రకాశం: అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన రోశిరెడ్డి అనే వృద్ధుడు గత రెండు రోజులుగా కనిపించడం లేదు. మతిస్థిమితం సరిగా లేని ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో అన్వేషించామని ఎవరన్నా గుర్తిస్తే నెంబర్ 8247684494కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు తెలిపారు.