AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి టైగర్‌జోన్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒడిశా, ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని టైగర్‌జోన్ ఏరియాలో కూంబింగ్ చేపట్టారు.