కృష్ణా: రహదారులపై వాకింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగి అనేక కుటుంబాల్లో విషాదం నిండుతోందని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల పెడనలో వాకర్ బాబురావు లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఘటనే ఇందుకు ఉదాహరణ. వాకర్స్ ఒక్కసారి ఆలోచించి, భద్రతా ప్రదేశాల్లోనే వాకింగ్ చేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.