లవంగం నూనెను అతిగా వాడితే అనర్థాలుంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి కండరాలను గాయపరుస్తుంది. ఎక్కువ ఉపయోగిస్తే జీర్ణవ్యవస్థలోకి చేరుతుంది. కడుపులో తిప్పడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలిగిస్తుంది. కాలేయాన్ని నష్టపరుస్తుంది. అలర్జీ కలుగుతుంది. విపరీతమైన మంట, అసౌకర్యం కలిగిస్తుంది. పిల్లలకు దీనిని ఉపయోగించకపోవడమే మంచిది.