KMM: కూసుమంచి మండలంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని బీజేపీ మండల ప్రధానకార్యదర్శి మహేందర్ నాయక్ కోరారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ప్రతిరోజూ రోడ్లపై గంటల తరబడి ఎండలో ఉంటున్నారు. ప్రజల సౌకర్యం, అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుని బస్టాండ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.