AP: గూగుల్ డేటా ప్రాజెక్ట్ వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాల సృష్టి జరుగుతుందని మంత్రి లోకేష్ ‘X’లో పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రపంచస్థాయి AI హబ్‌లను నిర్మించే దిశగా అంకిత భావంతో పని చేస్తోందన్నారు. వాటి ద్వారా నూతన ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. అంతేకాకుండా సాంకేతికంగా కూటమి సర్కార్ మరింత ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.